Aaqib Javed: ఆటగాళ్లను దూషించినట్లు వార్తలు.. స్పందించిన పాకిస్థాన్ కోచ్ 1 y ago
ఛాంపియన్స్ ట్రోఫీ లో పాకిస్థాన్ పరాభవంతో ప్లేయర్లపై అభిమానులు, మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈనేపథ్యంలో పాకిస్థాన్ జట్టు తాత్కాలిక కోచ్ అకీబ్ జావేద్ బ్యాటర్లను పరుష పదజాలంతో దూషించినట్లు వార్తలొచ్చాయి. అయితే, వాటిని జావేద్ ఖండించాడు. 'నేను ఆటగాళ్లను అస్సలు తిట్టను. ఎందుకంటే మన సంస్కృతిలో టీచర్లు, కోచ్లు తమ విద్యార్థులను తిట్టడం, కొట్టడం సాధారణం. కానీ, వీటిని నేను నమ్మను. ఆటగాళ్లను గౌరవిస్తాను. కోచ్ ఆటగాళ్ల నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి సలహాలు ఇవ్వాలి' అని అకీబ్ జావేద్ అన్నాడు.